రాష్ట్రంలో గ్యాంగ్‌స్టర్ వ్యవస్థ నడుస్తోంది: టీడీపీ
ABN , First Publish Date - 2021-10-25T08:40:34+05:30 IST
రాష్ట్రంలో గ్యాంగ్‌స్టర్ వ్యవస్థ నడుస్తోంది: టీడీపీ

గన్నవరం, అక్టోబరు 24: ‘‘ఆంరఽధప్రదేశ్‌ను వైసీపీ ప్రభుత్వం డ్రగ్ హబ్‌గా మార్చింది. సుబ్బారెడ్డి, శేఖర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డిలు రాష్ర్టాన్ని భాగాలుగా చేసుకొని గ్యాంగ్‌స్టర్ వ్యవస్థను తయారు చేసి లిక్కర్ ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటున్నారు’’ అని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఢిల్లీ బయలుదేరారు. ఆదివారం రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన నిమ్మల మీడియాతో మాట్లాడారు. ఇండియాలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్‌లను ఏపీలో తయారు చేస్తున్నారన్నారు. ఆంధ్రాలో 25వేల ఎకరాల్లో గంజాయి సాగు చేసి కేజీ రూ.10వేలకు అమ్ముతున్నారన్నారు. ఈ విషయాలపై టీడీపీ పోరాటాలు చేస్తుంటే వైసీపీ భయపడి టీడీపీ కార్యాలయం, నేతల ఇళ్లపై దాడులు చేస్తోందని, ఇది మంచి పద్ధతి కాదని నిమ్మల అన్నారు.