వైసీపీది ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం: సత్యప్రసాద్
ABN , First Publish Date - 2021-10-25T08:35:41+05:30 IST
వైసీపీది ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం: సత్యప్రసాద్

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలెప్పుడు వస్తాయో?, విధుల నుంచి ఎప్పుడు తొలగిస్తారో? తెలియని పరిస్థితి నెలకొందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. జగన్ పాలనలో ఉద్యోగులంతా అభద్రతాభావంలో ఉన్నారన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని ఆరోపించారు.