జగన్‌ది సానుభూతి రాజకీయం: అయ్యన్న
ABN , First Publish Date - 2021-10-25T08:34:43+05:30 IST
జగన్‌ది సానుభూతి రాజకీయం: అయ్యన్న

అమరావతి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ‘‘సింపతీ వస్తుందనుకుంటే తన ముఖం మీద తానే ఉమ్మేసుకునే రకం జగన్‌రెడ్డి’’ అని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు. ‘‘ఓట్లు, సీట్లు వస్తాయని తండ్రి, బాబాయ్ శవాల దగ్గర నుంచి కోడి కత్తి వరకు దేనినీ వదలని జగన్‌రెడ్డి.. బోస్‌డీకే పదాన్ని వదులుతాడా? తెలంగాణ పదకోశంలో ఆ పదానికి ‘పాడైపోయిన’ అనే అర్థముంది. సానుభూతి కోసం ఎంతకైనా దిగజారే జగన్‌రెడ్డి... సలహాల సజ్జలని బోస్‌డీకే అంటే అది తననే అన్నారని అన్వయించుకుని, ఆ పదానికి పెడర్థాలు తీసి, తల్లి పేరుతో కొత్త సెంటిమెంట్ కార్డు బయటకు తీశాడు. తల్లిపై నిజంగా ప్రేమ ఉంటే... తల్లిని బూతులు తిట్టిన వారికి మంత్రి పదవులివ్వడు. తల్లిని, చెల్లిని అలా అనాథలుగా తెలంగాణ రోడ్లపై అనాథలుగా వదిలేయడు’’ అని అయ్యన్న ట్వీట్ చేశారు.