జాతిపిత మెడలో వైసీపీ కండువాలు

ABN , First Publish Date - 2021-10-25T08:30:58+05:30 IST

జాతిపిత మెడలో వైసీపీ కండువాలు

జాతిపిత మెడలో వైసీపీ కండువాలు

కనిగిరి, అక్టోబరు 24: ప్రకాశం జిల్లా కనిగిరి పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలోని మహత్మాగాంధీ విగ్రహానికి అపచారం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు జాతిపిత విగ్రహం మెడలో వైసీపీ కండువాలు వేశారు. ఇది సోషల్‌ మీడియాలో ఆదివారం వైరల్‌ అయ్యింది. గాంధీ విగ్రహానికే వైసీపీ కండువాలు కప్పడం అవమానంగా పలువురు భావిస్తున్నారు. శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.  విషయాన్ని ఎస్‌ఐ రామిరెడ్డికి తెలియజేశారు. దీంతో ఆయన వచ్చి వైసీపీ కండువాలు తొలగించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు. ఇదిలావుంటే, కనిగిరిలోని ఒంగోలు బస్టాండ్‌లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి కూడా ఆదివారం వైసీపీ జెండాను తగిలించారు. దీనిపై దళిత నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కారుకులను పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కాగా, పోలీ్‌సస్టేషన్‌ ఆవరణలోని మహత్ముని విగ్రహం మెడలో వైసీపీ కండువాలు వేయడాన్ని నిరసిస్తూ టీడీపీ నాయకులు గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసు స్టేషన్‌ ఆవరణలోనే ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి ఘటనలతో పోలీసు వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్‌ విగ్రహానికి జైభీమ్‌ నేత సూరే రాజు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. Updated Date - 2021-10-25T08:30:58+05:30 IST