స్వామికే అపచారం.. మంచిదికాదు: లోకేశ్‌

ABN , First Publish Date - 2021-10-14T09:19:03+05:30 IST

స్వామికే అపచారం.. మంచిదికాదు: లోకేశ్‌

స్వామికే అపచారం.. మంచిదికాదు: లోకేశ్‌

అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ‘‘మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు ఏడుకొండలవాడి సేవచేసే అవకాశం దొరికితే.. ఆ స్వామికే అపచారం తలపెట్టే పనులు మంచిది కాదు’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హెచ్చరించారు. బుధవారం టీటీడీ చైౖర్మన్‌ సుబ్బారెడ్డి ని ఉద్దేశించి ట్విటర్‌లో స్పందించారు. ‘‘ఓ బాబాయికి గొడ్డలిపోటు కానుకగా ఇచ్చి, బాబాయి కోటాలో మిమ్మల్ని ఆ స్కీం కి ఎంపిక చేయని అబ్బాయి జగన్‌రెడ్డి మీ పాలిట దేవుడే కా వొచ్చు. ఆయన ఫోటో మీ ఇళ్లల్లో పెట్టి పూజించుకోండి. కొండపై గోవిందనామాల బదులు జగన్‌ నామస్మరణ మహాపరాధం. భక్తి ఉంటే భార్య ఎందుకు రాదు? అక్షింతల్ని అసహ్యంగా దులుపుకోవడం, ప్రసాదం వాసన చూడడం.. స్వా మిపై ఎందుకీ దొంగ భక్తి జగన్‌రెడ్డీ?’’ అని ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2021-10-14T09:19:03+05:30 IST