బద్వేలు బరిలో 15 మంది

ABN , First Publish Date - 2021-10-14T09:17:42+05:30 IST

బద్వేలు బరిలో 15 మంది

బద్వేలు బరిలో 15 మంది

30న పోలింగ్‌.. చురుకుగా సన్నాహాలు

కడప, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక బరిలో 15 మంది మిగిలారు. 27 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయ గా వివిధ కారణాల వల్ల 9 మంది నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి కేతన్‌గార్గ్‌ తిరస్కరించారు. 18 మంది నామినేషన్లు అర్హత సాధించాయి. విత్‌డ్రా చివరి రోజు బుధవారం ముగ్గురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 15 మంది బరిలో మిగిలారు. వారిలో వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ దాసరి సుధా, కాంగ్రెస్‌ అభ్యర్థి పీఎం కమలమ్మ, బీజేపీ అభ్యర్థి సురేశ్‌ ప్రధాన అభ్యర్థులుగా నిలిచారు.

Updated Date - 2021-10-14T09:17:42+05:30 IST