కొంచెం ఈజీ.. కొంచెం కష్టం!!

ABN , First Publish Date - 2021-10-11T08:43:32+05:30 IST

కొంచెం ఈజీ.. కొంచెం కష్టం!!

కొంచెం ఈజీ.. కొంచెం కష్టం!!

సివిల్స్‌ ప్రాథమిక పరీక్షలో కష్టంగా ఆంగ్లం, అర్థమెటిక్‌... 

ఈజీగా జనరల్‌ స్టడీస్‌

అమరావతి/హైదరాబాద్‌, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): యూపీఎస్సీ నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం దేశవ్యాప్తంగా 77 నగరాల్లో సాఫీగా జరిగింది. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, అనంతపురం, తిరుపతి నగరాల్లో పరీక్షను నిర్వహించారు. జనరల్‌ స్టడీ్‌సతోపాటు కనీస అర్హత పరీక్షలు నిర్వహించారు. కనీస అర్హత మార్కులు రావాల్సిన పరీక్షలో ఆంగ్లం, అర్థమెటిక్‌, రీజనింగ్‌ నుంచి ప్రశ్నలు ఉన్నాయి. ఈ పరీక్షలో కనీసం 67 మార్కులు వస్తేనే.. జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ మూల్యాంకనం చేస్తారు. అయితే, ఈసారి కనీస అర్హత మార్కులు సాధించాల్సిన పేపర్‌ కొంచెం కఠినంగా.. జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ తేలిగ్గా ఇచ్చారని అభ్యర్థులు తెలిపారు. జనరల్‌ స్టడీస్‌లో 80 ప్రశ్నలకుగాను.. చరిత్ర నుంచి 20 ప్రశ్నలు వచ్చాయి. 15 ప్రశ్నలు రాజనీతి శాస్త్రం నుంచి అడిగారు. ఈసారి కొత్తగా క్రీడలకు సంబంధించిన ప్రశ్నలను కూడా ఇచ్చారు.

Updated Date - 2021-10-11T08:43:32+05:30 IST