డిస్కంలకు ఏపీఈఆర్‌సీ ఘాటు లేఖ

ABN , First Publish Date - 2021-11-13T01:32:46+05:30 IST

రాష్ట్ర సీఎస్‌ , డిస్కంలు, ఇంధనశాఖ కార్యదర్శికి ఏపీఈఆర్‌సీ

డిస్కంలకు ఏపీఈఆర్‌సీ ఘాటు లేఖ

అమరావతి: రాష్ట్ర సీఎస్‌, డిస్కంలు, ఇంధనశాఖ కార్యదర్శికి ఏపీఈఆర్‌సీ ఘాటుగా లేఖ రాసింది. ఏపీ డిస్కంలకు చెల్లించాల్సిన వేల కోట్ల సబ్సిడీ బకాయిలపై ఈఆర్‌సీ లేఖ రాసింది. రూ. 25,257 కోట్ల బకాయిలపై ఈఆర్సీ రాసిన లేఖను టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ బయటపెట్టారు. ఈ నెల 9న ఏపీఈఆర్సీని కలిసి ఇంధన శాఖలో పరిస్థితులు నిర్ణయాలపై ఈఆర్సీకి పీఏసీ చైర్మన్ పయ్యావుల ఫిర్యాదు చేశారు. పయ్యావుల భేటీ తర్వాత ప్రభుత్వానికి ఏపీఈఆర్‌సీ లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి డిస్కంలకు రావాల్సిన రూ.15,474 కోట్ల సబ్సిడీ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ లేఖలో పేర్కొంది. బకాయిల చెల్లింపుపై 14 రోజుల గడువుతో నోటీసులు ఇవ్వాలని సూచించింది. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల నుంచి 14 రోజుల్లో స్పందన రాకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ఆదేశించింది. డిస్కంల మనుగడ ప్రమాదంలో పడిందని ఏపీఈఆర్‌సీ పేర్కొంది. 

Updated Date - 2021-11-13T01:32:46+05:30 IST