ఏపీ ఇంటెలిజెన్స్ కన్ను పడకుండా రహస్య ప్రదేశంలో పీఠాధిపతుల సమావేశం!

ABN , First Publish Date - 2021-02-03T00:42:56+05:30 IST

పీఠాధిపతుల కీలక సమావేశం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఏపీ ఇంటెలిజెన్స్ కన్ను పడకుండా రహస్య ప్రదేశంలో పీఠాధిపతుల సమావేశం!

అమరావతి: పీఠాధిపతుల కీలక సమావేశం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఏపీ, తమిళనాడు సరిహద్దులోని ఓ గ్రామంలో పీఠాధిపతులు సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. సమావేశానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ పెద్దలు కూడా హాజరయ్యారని తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ కన్ను పడకుండా ఉండేందుకు రహస్య ప్రదేశంలో ఈ సమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైంది.  


ఏపీలో ఆలయాలపై దాడులు, బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా వీరు సమావేశమైనట్టు తెలుస్తోంది. సమావేశంలో ముఖ్య నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. సమావేశానికి దేశంలోని ముఖ్య పీఠాధిపతులు హాజరయ్యారని సమాచారం. ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంతో పాటు మతమార్పిడులను జగన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆగ్రహంతో ఉన్న సంఘ్ పరివార్.. ఈ భేటీ ద్వారా హెచ్చరిక చేయాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, భేటీ సమాచారం తెలిసి పీఠాధిపతులతో మాట్లాడేందుకు ప్రభుత్వంలోని ముఖ్య నేత విఫలయత్నం చేశారని సమాచారం. ముఖ్య నేత సూచనతో ఓ మంత్రి రంగంలోకి దిగారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. భేటీకి వెళ్లకుండా పీఠాధిపతులను నిలువరించేందుకు మంత్రి సంప్రదింపులు జరపగా.. అది విఫలమైనట్టు తెలుస్తోంది.  

Updated Date - 2021-02-03T00:42:56+05:30 IST