అధికారులకు పట్టుబడ్డ 230 క్వింటాళ్ల బియ్యం లోడు

ABN , First Publish Date - 2021-10-25T23:54:57+05:30 IST

జిల్లాలోని చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామంలో రైసు మిల్లులో రెవిన్యూ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. 230 క్వింటాళ్ల బియ్యం లోడును అధికారులు గుర్తించారు.

అధికారులకు పట్టుబడ్డ 230 క్వింటాళ్ల బియ్యం లోడు

కృష్ణా: జిల్లాలోని చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామంలో రైసు మిల్లులో రెవిన్యూ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. 230 క్వింటాళ్ల బియ్యం లోడును అధికారులు గుర్తించారు. గుర్తించిన బియ్యం రేషన్ బియ్యమని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ అడ్రెస్ తో వే బిల్లు ఉంది. రేషన్ బియ్యమా లేక రైతువారీ ఆడిన బియ్యమా అన్నది తేల్చలేమని పీడీఎస్ సిబ్బంది పేర్కొన్నారు. 


Updated Date - 2021-10-25T23:54:57+05:30 IST