మంగళగిరి కోర్టులో నాదెండ్ల బ్రహ్మం చౌదరి హాజరు

ABN , First Publish Date - 2021-10-21T22:45:56+05:30 IST

మంగళగిరి కోర్టులో నాదెండ్ల బ్రహ్మం చౌదరి హాజరు

మంగళగిరి కోర్టులో నాదెండ్ల బ్రహ్మం చౌదరి హాజరు

గుంటూరు: నాదెండ్ల బ్రహ్మం చౌదరిని మంగళగిరి కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. మేడికొండూరు సీఐ మారుతీ కృష్ణ తనను కొట్టినట్లు బ్రహ్మం జడ్జీకి తెలిపారు.  మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గుంటూరు సబ్ జైలుకు బ్రహ్మం చౌదరిని తరలించారు. టీడీపీ కార్యాలయంలో తనను నిర్బంధించారని ఆర్.ఐ. సక్రూనాయక్ ఫిర్యాదు చేశారు. సక్రూనాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బ్రహ్మం చౌదరి ఏ-6గా ఉన్నారు. నిన్న బ్రహ్మం చౌదరిని మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. 

Updated Date - 2021-10-21T22:45:56+05:30 IST