యూట్యూబ్ విలేఖరి కేశవ హత్య నిందితులు అరెస్ట్

ABN , First Publish Date - 2021-08-11T01:49:22+05:30 IST

నంద్యాలలో యూట్యూబ్ విలేఖరి కేశవను హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

యూట్యూబ్ విలేఖరి కేశవ హత్య నిందితులు అరెస్ట్

కర్నూలు: నంద్యాలలో యూట్యూబ్ విలేఖరి కేశవను హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని కోర్టులో హాజరుపర్చారు. నిందితులు కానిస్టేబుల్ వెంకట సుబ్బయ్య, నాగేశ్వరరావు (నాని)లకు 14 రోజులు రిమాండ్ కోర్టు విధించింది. కానిస్టేబుల్ వెంకట సుబ్బయ్యను సర్వీస్ నుంచి తొలగిస్తూ జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.


Updated Date - 2021-08-11T01:49:22+05:30 IST