నకిలీ ఆనందయ్య కరోనా మందు రాకెట్ గుట్టురట్టు

ABN , First Publish Date - 2021-07-25T01:32:33+05:30 IST

నకిలీ ఆనందయ్య కరోనా మందు రాకెట్ గుట్టురట్టు

నకిలీ ఆనందయ్య కరోనా మందు రాకెట్ గుట్టురట్టు

ప్రకాశం: ఒంగోలు పోలీసుల సహకారంతో ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి నకిలీ ఆనందయ్య కరోనా మందు రాకెట్ గుట్టురట్టు చేసింది. గత కొంతకాలంగా ఆనందయ్య మందు పేరుతో నకిలీ మందును నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆర్. సురేష్ భారీ మొత్తానికి అమ్మకం చేస్తున్నట్లు గుర్తించారు. ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధి ఆనంద్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి సమాచారం ఇవ్వడంతో... సురేష్ గుట్టురట్టయింది. నకిలీ ఆనందయ్య మందును భారీ మొత్తానికి ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధి ఆనంద్‌కు విక్రయించేందుకు సురేష్ బేరం కుదుర్చుకున్నాడు.12 కేజీల ఆనందయ్య మందును సురేష్ కృష్ణపట్నం నుండి ఒంగోలుకు తీసుకువచ్చాడే. ఆయన దగ్గర నుండి తెచ్చాను అని నకిలీ మందు అమ్మేందుకు ప్రయత్నించాడు. తీసుకువచ్చిన మందు ఆనందయ్య మందు కాదని ఏబీఎన్ ఆంద్రజ్యోతి స్వయంగా ఆనందయ్యచే దృవీకరించడం జరిగింది. 


కరోనా కోసం తయారు చేసే మందు వాడాల్సిన పదార్థాలు సరైన పద్దతిలో వేసి తయారు చేయకుంటే తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో ఆనందయ్య మందుకు ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని సురేష్ భారీ మొత్తాలకు నకిలీ ఆనందయ్య మందును విక్రయించాడు. సురేష్ వ్యవహారంపై గత కొద్దిరోజులుగా నిఘా ఉంచిన ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సహకారంతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జాయింట్ ఆపరేషన్ చేపట్టింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2021-07-25T01:32:33+05:30 IST