ఏపీ: కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవలను మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు
ABN , First Publish Date - 2021-07-24T22:58:57+05:30 IST
ఏపీ: కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవలను మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు

అమరావతి: కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవలను మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల ఒప్పంద ఉద్యోగులకు మేలు చేకూరుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ప్రైవేటు ఎయిడెడ్ కాలేజీల్లో పని చేస్తున్న 719 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవలను మరో ఏడాది పాటు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ వారి సేవలను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించిందవి. జూన్ 2021 నుంచి ఓ పది రోజుల పాటు వారి సేవలకు విరామం ఉంటుందని ఉన్నత విద్యాశా ఉత్తర్వుల్లో వెల్లడించారు.