కొత్తగా 1,501 కేసులు.. 10 మరణాలు

ABN , First Publish Date - 2021-08-20T08:01:38+05:30 IST

రాష్ట్రంలో కొత్తగా 1,501 కరోనా కేసులు నమోదయ్యాయి.

కొత్తగా 1,501 కేసులు.. 10 మరణాలు

అమరావతి (ఆంధ్రజ్యోతి), కర్లపాలెం, ఆగస్టు 19: రాష్ట్రంలో కొత్తగా 1,501 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 67,716 శాంపిల్స్‌ను పరీక్షించగా ఈ మేరకు పాజిటివ్‌లు బయటపడ్డాయని, కరోనాతో మరో 10 మంది మరణించారని వైద్య ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 19,98,603కి, మరణాల సంఖ్య 13,696కి పెరిగింది. కాగా, గుంటూరు జిల్లా కర్లపాలెం మండలంలోని యాజలి జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో నలుగురు విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ పాఠశాలలో బుధవారం 100మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి వైరస్‌ సోకినట్టు గుర్తించారు. 

Updated Date - 2021-08-20T08:01:38+05:30 IST