కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఏమీ కేటాయించలేదు: గల్లా జయదేవ్‌

ABN , First Publish Date - 2021-02-01T23:02:55+05:30 IST

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఏమీ కేటాయించలేదని ఎంపీ గల్లా జయదేవ్‌ తప్పుబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రానికి మరోసారి నిరాశే మిగిలిందన్నారు.

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఏమీ కేటాయించలేదు: గల్లా జయదేవ్‌

ఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఏమీ కేటాయించలేదని ఎంపీ గల్లా జయదేవ్‌ తప్పుబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రానికి మరోసారి నిరాశే మిగిలిందన్నారు. కరోనా పరిస్థితుల తర్వాత దేశంలో అనేక రంగాలు పుంజుకున్నాయని తెలిపారు. మరికొన్ని రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. టీడీపీ హయాంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి నిధులు తెచ్చామని, ఈసారి వైసీపీ ఎంపీలు సాధించింది ఏమీలేదని గల్లా జయదేవ్‌ విమర్శించారు.


కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ చెన్నై మెట్రో రైలు విస్తరణకు రూ.63, 246 కోట్లు కేటాయించారు. అలాగే బెంగళూరు మెట్రోకు రూ.14,788 కోట్లు కేటాయించారు. ఇక కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జాతీయ రహదారులను నిర్మించేందుకు బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశారు. కానీ ఈ కేటాయింపులేవీ తెలుగు రాష్ట్రాల వరకు రాకపోవడం బాధాకరం. నిర్మలా బడ్జెట్‌పై తెలుగు నెటిజెన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

Updated Date - 2021-02-01T23:02:55+05:30 IST