ఇద్దరు ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధించిన ఏపీ హైకోర్టు

ABN , First Publish Date - 2021-06-22T21:33:10+05:30 IST

36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ ఏప్రిల్‌లో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో

ఇద్దరు ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధించిన ఏపీ హైకోర్టు

అమరావతి: 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ ఏప్రిల్‌లో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తర్వులు అమలు చేయాలంటూ పలుమార్లు ఆదేశించినప్పటికీ బేఖాతరు చేయడంతో ఐఏఎస్ అధికారి గిరిజా శంకర్, ఐఎఫ్ఎస్ అధికారి చిరంజీవి చౌదరికి కోర్టు వారం రోజులపాటు జైలు శిక్ష విధించింది. నేటి విచారణకు అధికారులు ఇద్దరు వ్యక్తిగతంతా హాజరయ్యారు. విచారణ సందర్భంగా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఉత్తర్వులను పెడచెవిన పెట్టినందుకు గాను ఇద్దరికీ చెరో వారం రోజులు జైలు శిక్ష విధించింది. 

Updated Date - 2021-06-22T21:33:10+05:30 IST