ఏపీ ఎస్ఈసీ పిటిషన్‌పై విచారణ వాయిదా
ABN , First Publish Date - 2021-01-12T23:01:39+05:30 IST
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో ఎస్‌ఈసీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ...

అమరాతి: పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో ఎస్‌ఈసీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఎస్‌ఈసీ తరపున లాయర్ అశ్విన్ కుమార్ గంటపాటు వాదనలు వినిపించారు. ఈనెల 17 వరకు ఏపీ హైకోర్టుకు సెలవులు ఉన్నాయి. దీంతో ఎస్‌ఈసీ రిట్ అప్పీల్ పిటిషన్‌పై హైకోర్టు తిరిగి రెగ్యులర్ కోర్టులో విచారణ చేయనుంది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 18కి వాయిదా వేసింది.
వాదనలు ఇలా జరిగాయి...
స్థానిక సంస్థల ఎన్నికల రద్దు ఆదేశాలపై అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదు: హైకోర్టు
రెగ్యులర్ కోర్టులో విచారణ చేద్దాం: హైకోర్టు డివిజన్ బెంచ్
అత్యవసర విచారణ చేయాల్సిన అవసరం ఉంది: ఎస్‌ఈసీ
ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది: ఎస్‌ఈసీ
ఈ నెల 23న మొదటి దశ ఎన్నికలు చేయాలి: ఎస్ఈసీ
స్టే వల్ల ఎన్నికల ప్రక్రియ జాప్యం అవుతుంది: ఎస్‌ఈసీ
ఎన్నికల కమిషన్‌కి ఇప్పటికే 4 వేల మెయిల్స్ వచ్చాయి
ఎన్నికల నిర్వహణ ఉంటుందా లేదా అని అడుగుతున్నారు: ఎస్‌ఈసీ
ఈ నెల 18న రెగ్యులర్ కోర్టులో వాదనలు వింటాం: హైకోర్టు
ఎలాక్ట్రోరల్ రోల్స్ అందజేసే ప్రక్రియ కొనసాగుతుంది: ఏపీ ప్రభుత్వం
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ పథకాల అమలుపై...
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అమలు చేస్తాం: ఏపీ ప్రభుత్వం