వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్స్‌పై హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్
ABN , First Publish Date - 2021-12-15T22:29:11+05:30 IST
వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్స్‌పై హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలైంది. రాజకీయ ప్రయోజనాలతో అడ్మిషన్స్ జరిగాయని పిటిషన్ వేశారు.

కడప: వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్స్‌పై హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలైంది. రాజకీయ ప్రయోజనాలతో అడ్మిషన్స్ జరిగాయని పిటిషన్ వేశారు. అనంతపురానికి చెందిన శంకర్ మహదేవ్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు. పిటిషనర్లకు మెరిట్ ఉన్నా ఎందుకు పక్కన పెట్టారో తెలపాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు పిటిషనర్ల పోస్టులు రిజర్వ్ చేయాలని ఏపీ ప్రాదేశిక క్రీడాశాఖ ఎండీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.