సినిమా టికెట్ల ధరపై High courtలో ఏపీ సర్కార్ అప్పీల్
ABN , First Publish Date - 2021-12-15T17:59:25+05:30 IST
సినిమా టికెట్ల ధరలపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది.

అమరావతి: సినిమా టికెట్ల ధరలపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించింది. ప్రభుత్వం తరుపు వాదనలు వినాలని ఏజీ హైకోర్టును కోరారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా... మధ్యాహ్నం 12:30 గంటలకు ధర్మాసనం వాదనలు విననుంది.
కాగా... ఏపీలో సినిమా టికెట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 35ను హైకోర్టు సస్పెండ్ చేసింది.. పాత విధానంలోనే టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు వెసులుబాటు కల్పిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.