ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ

ABN , First Publish Date - 2021-08-27T18:47:34+05:30 IST

ఎయిడెడ్ కళాశాలల విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ

అమరావతి: ఎయిడెడ్ కళాశాలల విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కళాశాలల్లో అడ్మిషన్లను కొనసాగించాలని ధర్మాసనం ఆదేశించింది. ఎయిడెడ్ కళాశాలలకు ఎయిడ్ నిలిపివేయడం, కళాశాలల స్వాధీనంపై హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషనర్ల తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఎయిడెడ్ కళాశాలల్లో అడ్మిషన్లను ఆపివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించారు. అయితే తాము అటువంటి ఆదేశాలు ఇవ్వలేదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై న్యాయవాది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇచ్చిందని చదివి వినిపించారు. అడ్మిషన్లు జరగకపోతే లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతారని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం అడ్మిషన్లు నిర్వహించుకోవచ్చని యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చింది. కళాశాలల స్వాధీనం నోటిఫికేషన్‌పై విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. 

Updated Date - 2021-08-27T18:47:34+05:30 IST