పెన్షనర్లకు డీఏ పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

ABN , First Publish Date - 2021-08-01T02:27:21+05:30 IST

రాష్ట్రంలోని ప్రభుత్వ పెన్షనర్లకు 3.144 శాతం డీఏ పెంచుతూ ఆదేశాలు ప్రభుత్వం

పెన్షనర్లకు  డీఏ పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

అమరావతి: రాష్ట్రంలోని  ప్రభుత్వ పెన్షనర్లకు 3.144 శాతం డీఏ పెంచుతూ ఆదేశాలు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెంచిన డీఏ 2019 జనవరి 1 నుంచి వర్తిస్తుందని పేర్కొంది. ఈ పెంపుతో 33.536 శాతానికి పెన్షనర్ల డీఏ పెరిగింది. 2021 జూలై  నుంచి పెంచిన డీఏతో కలిపి పింఛన్‌ను ప్రభుత్వం చెల్లించనుంది. పెండింగ్‌లో ఉన్న డీఏను ఇన్‌స్టాల్మెంట్‌లో చెల్లించనున్నట్టు ప్రభుత్వం స్పష్టంచేసింది. 2019 జూలై నుంచి పెంచాల్సిన మూడో డీఆర్ 5.24 శాతాన్ని 2022 జనవరి నెల నుంచి చెల్లించనున్నట్టు ఆర్థికశాఖ స్పష్టంచేసింది.


2018 జూలై 1న ఉన్న 27.248 శాతం నుంచి 30.392 శాతానికి పెన్షనర్ల డీఏ పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జూలై  నుంచి 5.24 శాతం మేర మూడో డీఆర్ పెంచింది. ఈ పెంపుతో 38.776 శాతానికి  పెన్షనర్ల డీఏ  పెరగనుంది. పెన్షనర్లకు కరవు భత్యం రేట్లను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated Date - 2021-08-01T02:27:21+05:30 IST