AP: వినియోగదారుల పరిరక్షణ చట్ట సభ్యుల నియామకంపై హైకోర్టులో అప్పీల్

ABN , First Publish Date - 2021-12-10T17:10:03+05:30 IST

రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన వినియోగదారుల పరిరక్షణ చట్ట సభ్యుల నియామకంపై హైకోర్టులో అప్పీల్ దాఖలైంది.

AP: వినియోగదారుల పరిరక్షణ చట్ట సభ్యుల నియామకంపై హైకోర్టులో అప్పీల్

అమరావతి: రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన వినియోగదారుల పరిరక్షణ చట్ట సభ్యుల నియామకంపై హైకోర్టులో అప్పీల్ దాఖలైంది. వినియోగదారుల సభ్యుల నియామకంలో జోక్యం చేసుకోమంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై నెల్లూర్‌కు చెందిన కోలా ఉమామహేశ్వరరావు ధర్మాసనానికి అప్పీల్ దాఖలు చేశారు. వినియోగదారుల సభ్యుల నియామకం పూర్తిగా రాజకీయ సిఫార్సులతో జరిగిందని  ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. వీటికి చట్టబద్ధత కల్పించడం సుప్రీంకోర్టు నియమాలకు వ్యతిరేకమని హైకోర్టుకు తెలిపారు.  సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు ఏకపక్షంగా ఉన్నాయంటూ ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రభుత్వ న్యాయవాదిని కౌంటర్ దాఖలు చేయవలసిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 

Updated Date - 2021-12-10T17:10:03+05:30 IST