కేంద్ర నిధులను దారిమళ్లిస్తున్న ఏపీ సర్కారు

ABN , First Publish Date - 2021-12-09T08:49:37+05:30 IST

దేశంలో పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ప్రాయోజిత

కేంద్ర నిధులను దారిమళ్లిస్తున్న ఏపీ సర్కారు

రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల

న్యూఢిల్లీ, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): దేశంలో పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ప్రాయోజిత పథకాల నిధులను ఏపీ ప్రభుత్వం దారిమళ్లిస్తోందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ తెలిపారు. ఇటీవల ఓ కేంద్ర మంత్రి కూడా ఈ విషయాన్ని బహిరంగ పరిచారని, కనుక ఇకపై ఆయా పథకాల నిధులు పక్కదారి పట్టకుండా కఠిన నిబంధనలతో చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం రాజ్యసభ జీరో అవర్లో ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం(నరేగా) నిధులతోపాటు, స్థానిక సంస్థలకు ఇచ్చిన నిధులు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ నిధులు కూడా ఇతర పథకాలకు మళ్లిస్తోందన్నారు.  

Updated Date - 2021-12-09T08:49:37+05:30 IST