ఏపీ ప్రభుత్వంతో.. చిరంజీవి తాడో పేడో..?

ABN , First Publish Date - 2021-12-26T01:08:34+05:30 IST

ఏపీలో సినిమా థియేటర్ల, టికెట్ల ధరలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకి మెగాస్టార్ చిరంజీవి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారా?.

ఏపీ ప్రభుత్వంతో.. చిరంజీవి తాడో పేడో..?

అమరావతి: ఏపీలో సినిమా థియేటర్ల, టికెట్ల ధరలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకి మెగాస్టార్ చిరంజీవి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారా?. ఈ విషయంపై తాడో పేడో తేల్చుకునేందుకు చిరు స్టెప్ వేయబోతున్నాడా..? అంటే ప్రస్తుతం టాలీవుడ్ నుండి అటువంటి సంజ్ఞలే కనిపిస్తున్నాయి. తెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసానితో సంప్రదింపులు జరిపి ముఖ్యమంత్రి కేసీఆర్‌‌‌ టికెట్ల ధర సమస్యను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించిన చిరంజీవి.. ఇప్పుడు ఏపీలో ఉన్న సమస్యపై కూడా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. 


రానున్న రెండు మూడు రోజుల్లో ఏపీ మంత్రి పేర్ని నాని ద్వారా సీఎం జగన్‌ని చిరంజీవి కలవబోతున్నట్లుగా తాజాగా టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే.. పరిస్థితి మరింతగా దిగజారే అవకాశాలు ఉన్నాయని భావించిన చిరు, స్వయంగా తనే రంగంలోకి దిగి.. తెలంగాణలో మాదిరిగా.. ఏపీలో కూడా సమస్యను పరిష్కరించే దిశగా పాత్ర పోషించబోతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే పేర్ని నాని ద్వారా ఇప్పటికే సీఎం జగన్ అపాయింట్‌మెంట్ కూడా చిరు తీసుకున్నట్లుగా టాక్ నడుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Updated Date - 2021-12-26T01:08:34+05:30 IST