కక్ష సాధింపులు మాని... కోవిడ్‌పై దృష్టి పెట్టండి : చినరాజప్ప

ABN , First Publish Date - 2021-05-09T02:20:21+05:30 IST

కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో కూడా ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని

కక్ష సాధింపులు మాని... కోవిడ్‌పై దృష్టి పెట్టండి : చినరాజప్ప

రాజమండ్రి : కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో కూడా ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. కోవిడ్ వ్యాప్తిని నియంత్రించడం, వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని, కోవిడ్ బారిన పడిన రోగులకు పడకలు, ఆక్సిజన్ దొరకక పిట్టల్లా రాలిపోతున్నారని పేర్కొన్నారు. కోవిడ్ రోగులను కాపాడేందుకు సరైన వైద్య సేవలు అందించడంపై ప్రభుత్వం ఏమాత్రం దృష్టి నిలపడం లేదని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ రోగులను నిలువు దోపిడీ చేస్తున్నా పట్టించుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న చంద్రబాబుపైన, నేడు లోకేశ్‌పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించడం మానేసి, ముందు కోవిడ్ పై దృష్టి నిలపాలని హితవు పలికారు. 

Updated Date - 2021-05-09T02:20:21+05:30 IST