పోలీసులకు సొంత జీవితం చాలా తక్కువ: డీజీపీ సవాంగ్
ABN , First Publish Date - 2021-10-29T02:39:49+05:30 IST
పోలీసులకు స్వప్రయోజనాలు, సొంత జీవితం చాలా తక్కువ అని

అమరావతి: పోలీసులకు స్వప్రయోజనాలు, సొంత జీవితం చాలా తక్కువ అని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా జరిగిన కార్యక్రమంలో డీజీపీ పాల్గొని మాట్లాడారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా బ్రాండ్ డిస్ప్లే చేస్తున్నాన్నారు. అమరవీరులకు నివాళులు అర్పించుకోవడానికి ఇది సరైన సమయని ఆయన అన్నారు. పోలీసులు ప్రతీ సమయంలో వెంటనే అందుబాటులో ఉండాల్సిన పరిస్ధితి ఉంటుందన్నారు.
సమాజానికి సేవ చేయడంతో పాటు తన కుటుంబానికి కూడా పోలీసు పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. కష్టమైన పరిస్థితులలో పోలీసులు పనిచేస్తారన్నారు. సమాజ సేవలో పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా తమలో కొంతమందిని కోల్పోయామని డీజీపీ గౌతం సవాంగ్ ఆవేదన వ్యక్తం చేసారు.