ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు..

ABN , First Publish Date - 2021-06-07T20:31:34+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సోమవారం కోవిడ్‌పై సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో...

ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సోమవారం కోవిడ్‌పై సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  కర్ఫ్యూ జూన్ 20 వరకు పొడిగించారు. ఈ నెల 10వ తేదీ తర్వాత కర్ఫ్యూ సడలింపు సమయం పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది.


ప్రస్తుతం కర్ఫ్యూ ఉదయం 6 నుంచి 12 గంటల వరకు సడలింపు అమలులో ఉంది. దీన్ని 10వ తేదీ తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు పొడిగించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయడానికి అనుమతి ఇస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి థర్డ్ వేవ్‌కు సంబంధించి చర్చలు జరిపారు. పలు సూచనలు చేశారు. ఈ భేటీలో సీఎస్, డీజీపీ, వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-07T20:31:34+05:30 IST