ఓటీ‘ఎస్‌’ అనలేక..ప్రకాశంలో మరో వలంటీర్‌ రాజీనామా

ABN , First Publish Date - 2021-12-30T08:18:14+05:30 IST

వన్‌ టైం సెటిల్మెంట్‌ (ఓటీఎ్‌స)కు వ్యతిరేకంగా మరో వలంటీర్‌ గళమెత్తారు. ప్రకాశం జిల్లా సి.ఎ్‌స.పురం మండలం కంభంపాడు పంచాయతీలో పనిచేసే వలంటీర్‌ అన్నంగి రంగయ్య రాజీనామా చేశారు.

ఓటీ‘ఎస్‌’ అనలేక..ప్రకాశంలో మరో వలంటీర్‌ రాజీనామా

సీఎస్‌పురం, డిసెంబరు 29: వన్‌ టైం సెటిల్మెంట్‌ (ఓటీఎ్‌స)కు వ్యతిరేకంగా మరో వలంటీర్‌ గళమెత్తారు. ప్రకాశం జిల్లా సి.ఎ్‌స.పురం మండలం కంభంపాడు పంచాయతీలో పనిచేసే వలంటీర్‌ అన్నంగి రంగయ్య రాజీనామా చేశారు. గత ప్రభుత్వాల హయాంలో పక్కా గృహాలు నిర్మించుకున్న పేదల నుంచి రూ.10వేలు వసూలు చేయాలని అధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, ఈ పద్ధతి సరైనది కాదని తెలిపారు. వైసీపీ నాయకులు తమ సానుభూతిపరులకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఇతర పార్టీలకు చెందిన తన బంధువులకు దూరంగా ఉండాలని బెదిరిస్తున్నారని తెలిపారు.  నిర్బంధ ఓటీఎస్‌ వసూలు చేయలేక, అధికారపార్టీ ఒత్తిళ్లు తట్టుకోలేక రాజీనామా చేసినట్లు రంగయ్య పేర్కొన్నారు. అనంతరం ఆయన బుధవారం సీఎస్‌పురంలో జరిగిన ఓ కార్యక్రమంలో టీడీపీ కనిగిరి ఇన్‌చార్జ్‌, మాజీ శాసనసభ్యుడు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

Updated Date - 2021-12-30T08:18:14+05:30 IST