విశాఖలో మరో ఎంఎస్‌ఎంఈ పార్క్‌: మేకపాటి

ABN , First Publish Date - 2021-11-09T08:22:06+05:30 IST

విశాఖలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎ్‌సఎంఈ) పార్కు అభివృద్ధికి ముందుకొచ్చిన భూమి వరల్డ్‌ గ్రూప్‌ ప్రతిపాదనపై

విశాఖలో మరో ఎంఎస్‌ఎంఈ పార్క్‌: మేకపాటి

అమరావతి, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): విశాఖలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎ్‌సఎంఈ) పార్కు అభివృద్ధికి ముందుకొచ్చిన భూమి వరల్డ్‌ గ్రూప్‌ ప్రతిపాదనపై ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది సహా ఉన్నతాధికారులతో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చర్చించారు. ఈ మేరకు మంత్రితో భూమి వరల్డ్‌ గ్రూప్‌ ప్రతినిధులు సోమవారం మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో సమావేశమయ్యారు. పీపీపీ విధానంలో పార్కు అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రతిపాదన కార్యరూపం దాల్చే విధంగా పలు సూచనలతో మంత్రి గడువును నిర్దేశించారు. 


మంత్రిని మరోమారు కలిసిన ఇండో జపాన్‌ ప్రతినిధులు

పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటిని ఇండో జపాన్‌ ప్రతినిధులు సోమవారం సాయంత్రం మరోమారు కలిశారు. పెట్టుబడులు, ఐటీ పార్కులు, సెజ్‌లు, టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. ప్రభుత్వ భాగస్వామ్యం అవడానికి మంత్రి వారికి పలు సూచనలు చేస్తూ గడువు నిర్దేశించారు. కార్యక్రమంలో ఏపీఎ్‌సఎ్‌సడీసీ చైర్మన్‌ అజయ్‌, ఎండీ బంగారు రాఉ, ఏపీటీఎస్‌ ఎండీ నందకిశోర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-09T08:22:06+05:30 IST