సుప్రీం చీఫ్‌ జస్టిస్‌గా మరో తెలుగు వ్యక్తి!

ABN , First Publish Date - 2021-08-27T08:57:13+05:30 IST

సుప్రీంకోర్టుకు ముగ్గురు మహిళా న్యాయమూర్తులు సహా 9 మందిని నియమించాలంటూ సుప్రీం కొలీజియం చేసిన..

సుప్రీం చీఫ్‌ జస్టిస్‌గా మరో తెలుగు వ్యక్తి!

న్యాయవాది నుంచి నేరుగా సుప్రీంకు నరసింహా

9 మంది జడ్జీల నియామకాలకు రాష్ట్రపతి ఓకే 

న్యూఢిల్లీ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టుకు ముగ్గురు మహిళా న్యాయమూర్తులు సహా 9 మందిని నియమించాలంటూ సుప్రీం కొలీజియం చేసిన సిఫారసులను రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ఆమోదించారు. నియామకాలపై కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్లు గురువారం జారీ చేసింది. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పీఎస్‌ నరసింహా న్యాయవాది నుంచి నేరుగా సుప్రీం జడ్జిగా నియమితులవుతున్నారు. ఆయన పలు సంచలన, ముఖ్యమైన కేసుల్లో వాదించారు. అందులో అయోధ్య కేసు ప్రధానమైనది. ఈయనతోపాటు.. వయసు రీత్యా సీనియారిటీ ప్రకారం జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ నాగరత్నకు సీజేఐ అయ్యే అవకాశాలున్నాయి. ఒకేసా రి ముగ్గురు మహిళా న్యాయమూర్తులను సుప్రీం జడ్జీలుగా నియమించడం ఇదే తొలిసారి కాగా.. 2027లో జస్టిస్‌ నాగరత్న దేశానికి తొలి మహిళా సీజేఐ కానున్నారు. కొత్త జడ్జిలు ఈ నెల 31న ప్రమాణ స్వీకారం చేస్తారు. 

Updated Date - 2021-08-27T08:57:13+05:30 IST