మరో 523 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-10-21T09:39:44+05:30 IST
రాష్ట్రంలో కొత్తగా 523 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మరణించారు.
రాష్ట్రంలో కొత్తగా 523 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 20,61,810కి, మరణాల సంఖ్య 14,320కి పెరిగిందని వైద్యఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. బుధవారం 608 మంది డిశ్చార్జ్ కాగా.. మొత్తం రికవరీల సంఖ్య 20,40,924కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,566 యాక్టివ్ కేసులున్నాయి.