మూడు జిల్లాల నాయకులు కుట్ర పన్నారు: ఆంజనేయ కుమార్

ABN , First Publish Date - 2021-03-21T21:05:47+05:30 IST

సంఘాన్ని చీల్చాలని మూడు జిల్లాల నాయకులు కుట్ర పన్నారని వీఆర్వో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూడు జిల్లాల నాయకులు కుట్ర పన్నారు: ఆంజనేయ కుమార్

విజయవాడ:  తమ సంఘాన్ని చీల్చాలని మూడు జిల్లాల నాయకులు కుట్ర పన్నారని వీఆర్వో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సూర్యనారాయణ, వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఇష్టమొచ్చినట్లు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారని మండిపడ్డారు. వెంకటరామిరెడ్డి, సూర్యనారాయణకు తమ సంఘంతో రాజకీయం చేస్తున్నారన్నారు. వారి సంఘాలను చీలిస్తే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలకు సహకరించిన ఇద్దరు జిల్లా అధ్యక్షులను డిస్మీస్ చేస్తున్నామని చెప్పారు.


ఇకపై ఎవరైనా సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే వారంలో ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. దమ్ముంటే వ్యతిరేకించే వారు ముందుకు రావాలని స్పష్టం చేశారు. జేఏసీ పైన ఉన్న వ్యతిరేకతను తమపై రుద్దుతున్నారని ఆంజనేయకుమార్ ధ్వజమెత్తారు.

Updated Date - 2021-03-21T21:05:47+05:30 IST