వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండలరావు రాజీనామా

ABN , First Publish Date - 2021-11-21T19:34:58+05:30 IST

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండలరావు రాజీనామా

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండలరావు రాజీనామా

రాజమహేంద్రి: నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండలరావు రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వం, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి కొండలరావు రాజీనామా చేశారు. వైసీపీ నేత ఇంట్లో వివాహానికి చందాలు వసూలు చేశారని కొండలరావు సెల్పీ వీడియో విడుదల చేశారు. పలు అక్రమాలతో పాటు సెటిల్మెంట్లు చేస్తున్న ముగ్గురు బ్రోకర్లకు వైసీపీ కీలక నేత సహకరిస్తున్నారని కొండలరావు ఆరోపించారు. సొంత పార్టీవారే తనపై బురద జల్లటంతో మనస్థాపంతో రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు.

Updated Date - 2021-11-21T19:34:58+05:30 IST