జీవోల జారీలో మ్యాన్యువల్ ప్రక్రియను పునరుద్ధరిస్తోన్న ఏపీ సర్కార్

ABN , First Publish Date - 2021-08-18T00:30:50+05:30 IST

జీవోల జారీలో మ్యాన్యువల్ ప్రక్రియను పునరుద్ధరిస్తోన్న ఏపీ సర్కార్

జీవోల జారీలో మ్యాన్యువల్ ప్రక్రియను పునరుద్ధరిస్తోన్న ఏపీ సర్కార్

అమరావతి: జీవోల జారీలో మ్యాన్యువల్ ప్రక్రియను ఏపీ సర్కార్ పునరుద్ధరిస్తోంది. ప్రభుత్వ జీవోలు ఆన్‌లైన్‌లో ఉంచకూడదంటూ ఇచ్చిన ఆదేశాల కనుగుణంగా జీవోఐఆర్‌లో మంగళవారం నుంచి జీవోల నిలిపివేతకు నిర్ణయం తీసుకుంది. జీవోలను ఆన్‌లైన్‌లో ఉంచకూడదంటూ సోమవారం తీసుకున్న నిర్ణయానికి కొనసాగింపుగా మరో నోట్‌ను జీఏడీ జారీ చేసింది. ఇకపై ప్రభుత్వంలోని ప్రతి శాఖ ఉత్తర్వుల జారీకి రిజిస్టర్లను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాల శాఖ ముఖ్యకార్యదర్శి రేవు ముత్యాలరాజు పేరుతో నోట్ జారీ అయింది. జీవోఎంఎస్, జీవో ఆర్టీ, జీవోపీ పేరిట మూడు వేర్వేరు రిజిస్టర్లను ప్రతి ప్రభుత్వ శాఖ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా వెల్లడించారు. ఏపీ సచివాలయ మాన్యువల్ 2005 ప్రకారం గతంలో జారీ చేసినట్టుగానే ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు 3 రకాల రిజిస్టర్లను ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ ‎ఆదేశించింది. 



Updated Date - 2021-08-18T00:30:50+05:30 IST