చర్చల తీరుపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అసంతృప్తి
ABN , First Publish Date - 2021-12-15T22:20:04+05:30 IST
చర్చల తీరుపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అసంతృప్తి వ్యక్తం చేశారు. తన వంతు సమయం వచ్చినప్పుడు చర్చకు వస్తానని సమావేశం నుంచి సూర్యనారాయణ బయటకొచ్చేశారు.

అమరావతి: చర్చల తీరుపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అసంతృప్తి వ్యక్తం చేశారు. తన వంతు సమయం వచ్చినప్పుడు చర్చకు వస్తానని సమావేశం నుంచి సూర్యనారాయణ బయటకొచ్చేశారు. చర్చల్లో అసలు విషయం కాకుండా ఉపన్యాసాలు ఇస్తున్నారంటూ.. బండి, బొప్పరాజుపై సూర్యనారాయణ మండిపడ్డారు. చిట్‌చాట్ తరహాలో సమావేశం జరుగుతోందన్నారు.