ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి స్థావరాలు, సాగుపై పోలీసుల ప్రత్యేక నిఘా

ABN , First Publish Date - 2021-10-29T19:30:37+05:30 IST

మాదకద్రవ్యాలు.. రవాణా కేర్ ఆఫ్ అడ్రెస్ ఆంధ్రప్రదేశ్ అని విమర్శలు రావడంతో ఆంధ్ర పోలీసులు...

ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి స్థావరాలు, సాగుపై పోలీసుల ప్రత్యేక నిఘా

అమరావతి: మాదకద్రవ్యాలు.. రవాణా కేర్ ఆఫ్ అడ్రెస్ ఆంధ్రప్రదేశ్ అని విమర్శలు రావడంతో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి స్థావరాలు, సాగుపై పోలీసులు  ప్రత్యేక నిఘా పెట్టారు. గంజాయిని సమూలంగా నిర్వీర్యం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏవోబీ  ప్రాంతాల్లో  పెద్ద స్థాయిలో గంజాయి సాగు విస్తీర్ణాన్ని పోలీసులు గుర్తించారు. డ్రోన్ల సహాయంతో ఏ ప్రాంతంలో ఎంత విస్తీర్ణంలో గంజాయి సాగు జరుగుతుందో వివరాలు సేకరిస్తున్నారు. ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలో పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. గంజాయి పంటను పొలాల్లోనే ధ్వంసం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. మరో వారం రోజుల్లో కార్యాచరణ అమలు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.

Updated Date - 2021-10-29T19:30:37+05:30 IST