హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ తిల్హరి ప్రమాణం

ABN , First Publish Date - 2021-10-19T08:28:16+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ తిల్హరి ప్రమాణం

అమరావతి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సోమవారం ఉదయం 10.30 గంటలకు జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరితో చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించారు. హైకోర్టు న్యాయమూర్తులతో పాటు అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జానకీరామిరెడ్డి, పలువురు న్యాయవాదులు జస్టిస్‌ తిల్హరికి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2021-10-19T08:28:16+05:30 IST