అరాచక పాలన, రౌడీరాజ్యం: అనిత
ABN , First Publish Date - 2021-10-21T11:09:09+05:30 IST
రాష్ట్రంలో అరాచక పాలనని, రౌడీరాజ్యాన్ని చూస్తున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు.
అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అరాచక పాలనని, రౌడీరాజ్యాన్ని చూస్తున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. 16 నెలలు జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తికి రాజ్యాధికారం ఇస్తే రాష్ట్రం ఎలా తగలబడిపోతుందో, సదరు అధికార ఫలాలు ఎలా ఉంటాయో ప్రజలు రుచిచూస్తున్నారన్నారు. బుధవారం ఆమె మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ సీఎంను అంటే ఊరుకోమని మంత్రులు హూంకరిస్తున్నారు.. ప్రతిపక్షనేతను అంటుంటే టీడీపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోవాలా? పోలీసులు లేకుండా సీఎం, వైసీపీ నేతలు బయటకొస్తే అప్పుడు టీడీపీ కార్యకర్తల పవరేంటో తెలుస్తుంది. ప్రతిపక్ష నేతగా జగన్ చంద్రబాబును ఎన్నిమాటలన్నాడో డీజీపీకి, హోం మంత్రికి తెలియదా?’’ అని అనిత ప్రశ్నించారు.