ఆనందంలో ఆనందయ్య...

ABN , First Publish Date - 2021-05-31T20:30:26+05:30 IST

ఆనందంలో ఆనందయ్య...

ఆనందంలో ఆనందయ్య...

అమరావతి: ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆనందయ్య సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ఇంటి వద్ద సందడి నెలకొంది. ప్రస్తుతం ఆనందయ్య కృష్ణపట్నం సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అకాడమీలోనే ఉన్నారు. ఇప్పటికైనా ఆనందయ్యకు పోలీసులు విముక్తి కలిగిస్తారని గ్రామస్తులు, కుటుంబసభ్యులు భావిస్తున్నారు. సోమవారం సాయంత్రానికి ఆనందయ్య ఇంటికి చేరుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తానికి ఈ మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


కరోనా మహమ్మారికి విరుగుడుగా నెల్లూరు ఆనందయ్య ఇస్తున్న మందులకు ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కళ్లలో వేసే డ్రాప్స్ తప్ప మిగితా అన్ని మందులకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. సీసీఆర్ఏఎస్ నివేదిక ప్రకారం ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్ మందులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రాలేదని, అవి వచ్చాక ఆ మందుపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెప్తోంది. అలాగే ‘కె’ అనే మందును కమిటీ ముందు చూపించకపోవడంతో దానికి కూడా అనుమతి నిరాకరించింది. ఇక ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల ఎలాంటి హాని లేదని సీసీఆర్ఏఎస్ నివేదిక తేల్చడంతో ప్రభుత్వం వాటికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. కంట్లో వేసే డ్రాప్స్‌ విషయంలో పూర్తి నివేదికలు రావడానికి మరో 2–3 వారాల సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Updated Date - 2021-05-31T20:30:26+05:30 IST