‘ఆనందయ్య మందుపై దుష్ప్రచారం వద్దు’

ABN , First Publish Date - 2021-05-30T14:48:33+05:30 IST

ఆనందయ్య మందుపై దుష్ప్రచారం వద్దని..

‘ఆనందయ్య మందుపై దుష్ప్రచారం వద్దు’

  • కరోనా కట్టడిపై వివరాల సేకరణ 
  • బీసీ కమిషన్‌ జాతీయ సభ్యుడు ఆచారి తల్లోజు

నెల్లూరు : ఆనందయ్య మందుపై దుష్ప్రచారం వద్దని, నివేదికను బట్టి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి తల్లోజు  అన్నారు. నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శనివారం నెల్లూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జిల్లా అధికారులతో కరోనాపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కరోనా రోగులకు అందుతున్న సేవలపై అధికా రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్‌ సరఫరా, నిల్వలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. భారతీయ సనాతన ధర్మంలో ఆయుర్వేదం ఒక భాగమని, త్వరలోనే ఆనందయ్య మందుపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సమీక్షలో ఎంబీసీ కమిషన్‌ సభ్యుడు టీ.నరసింహ, జాయింట్‌ కలెక్టర్లు హరేందిర ప్రసాద్‌, గణేష్‌కుమార్‌, బాపి రెడ్డి, అడిషనల్‌ ఎస్పీ వెంకటరత్నం, డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి, ఆర్‌డీవో హుస్సేన్‌సాహెబ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-30T14:48:33+05:30 IST