గోత్రంలేని జగన్‌రెడ్డికి మతాల గురించి ఏమీ తెలుసు: ఆనం వెంకట రమణారెడ్డి
ABN , First Publish Date - 2021-01-12T19:56:52+05:30 IST
వైసీపీ మ్యానిఫెస్టోని సీఎం గజన్ పవిత్ర మత గ్రంధాలతో పోల్చారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నెల్లూరు: గోత్రంలేని సీఎం జగన్‌రెడ్డికి మతాల గురించి ఏమీ తెలుసు అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..వైసీపీ మ్యానిఫెస్టోని సీఎం జగన్ పవిత్ర మత గ్రంధాలతో పోల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవుళ్ల డబ్బుని నవరత్నాలకి వినియోగించే హక్కు జగన్‌రెడ్డికి ఎవరిచ్చారని నిలదీశారు. ఆలయాలకి హిందువులిచ్చిన విరాళాలని స్పష్టం చేశారు. దేవాదాయశాఖ నిధులని బ్రాహ్మణ కార్పొరేషన్‌కి, అక్కడి నుంచి పీడీ అకౌంట్లకి తరలించి డ్రా చేశారని మండిపడ్డారు. ముస్లింల సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన మైనార్టీ వెల్ఫేర్ డబ్బునీ నవరత్నాలకి కేటాయించారన్నారు. వీటికి సంబంధించిన ప్రభుత్వ జీవో కాపీలను ఆనం వెంకట రమణారెడ్డి మీడియా ముందు ప్రదర్శించారు.