అంతిమ విజయం మాదే

ABN , First Publish Date - 2021-08-20T07:55:34+05:30 IST

అమరావతి ఉద్యమం ధర్మమైందని, సమస్యలను తెలియజేయటానికి శాంతియుతంగా పోరాటం చేస్తున్నామని రాజధాని రైతులు పేర్కొన్నారు.

అంతిమ విజయం మాదే

రాజధాని రైతుల స్పష్టీకరణ...611వ రోజుకు ఉద్యమం

తుళ్లూరు, ఆగస్టు 19: అమరావతి ఉద్యమం ధర్మమైందని,  సమస్యలను తెలియజేయటానికి శాంతియుతంగా పోరాటం చేస్తున్నామని రాజధాని రైతులు పేర్కొన్నారు. కానీ, ప్రభుత్వం ఆలకించకుండా ఉద్యమం అణచి వేతకు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి  కొనసాగాలని చేస్తున్న ఉద్యమం గురువారం 611వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతులు, మహిళలు, రైతు కూలీలు మాట్లాడుతూ... రాజధానికి ప్రభుత్వం భూములు అడిగితే ఇచ్చామని, ప్రభుత్వం మారగానే మూడు రాజధానులని అమరావతిని నాశనం చేశారన్నారు.  రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల అభివృద్ధిని నాశనం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పెయిడ్‌ ఆరిస్టులం కాదని, ఏ క్షణానైనా వచ్చి మా ఆధార్‌ కార్డులు చెక్‌ చేసుకోవచ్చన్నారు.   సీఎం జగన్‌రెడ్డి ప్రభుత్వం పెయిడ్‌ ఆర్టిస్టుల చేత మూడు రాజధానుల  దీక్ష  నిర్వహిస్తోందన్నారు.  మా పక్కన న్యాయం ఉంది,  అంతిమ విజయం మాదే అని రైతులు స్పష్టం చేశారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది.  

Updated Date - 2021-08-20T07:55:34+05:30 IST