రస్‌ అల్‌ఖైమా కేసులో.. ఏపీదే బాధ్యత!

ABN , First Publish Date - 2021-10-23T08:46:50+05:30 IST

రస్‌ అల్‌ఖైమా కేసులో తమకేం సంబంధం లేదని, ఏదైనా ఏపీ ప్రభుత్వానిదే బాధ్యత అని కేంద్రం స్పష్టం చేసింది...

రస్‌ అల్‌ఖైమా కేసులో.. ఏపీదే బాధ్యత!

అమరావతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): రస్‌ అల్‌ఖైమా కేసులో తమకేం సంబంధం లేదని, ఏదైనా ఏపీ ప్రభుత్వానిదే బాధ్యత అని కేంద్రం స్పష్టం చేసింది. విశాఖపట్నం జిల్లా మాకవరంపాలెం సమీపంలో అల్యూమినియం పరిశ్రమ స్థాపించేందుకు రస్‌ అల్‌ఖైమా, పెన్నా సిమెంట్స్‌ లిమిటెడ్‌లు రాష్ట్ర ప్రభుత్వంతో సంయుక్తంగా ఒప్పందం చేసుకున్నాయి. ఉమ్మడి ఏపీలో వైఎస్‌ సీఎంగా ఉండగా ఈ ఒప్పందం జరిగింది. ఈ పరిశ్రమకు అవసరమైన బాక్సైట్‌ గనులను కూడా కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చారు. అయితే ఆ తర్వాత కాలంలో వచ్చిన తీవ్ర వ్యతిరేకత తో బాక్సైట్‌ గనుల లీజును రద్దుచేశారు. తాము ఇప్పటికే అక్కడ అల్యూమినియం ప్లాంట్‌ పెట్టేందుకు పెట్టుబడి పెట్టామని...ఇప్పుడు ఒప్పందం రద్దు చేయడంతో నష్టపోయామంటూ రస్‌ అల్‌ఖైమా కొన్నేళ్ల క్రితం లండన్‌లోని అంతర్జాతీయ వివాద పరిష్కార (ఆర్బిట్రేషన్‌) న్యాయస్థానంలో కేసు వేసింది.

Updated Date - 2021-10-23T08:46:50+05:30 IST