పొగాకు ఉత్పత్తుల వాడకంలో చివరి స్థానంలో ఏపీ!
ABN , First Publish Date - 2021-10-21T11:14:19+05:30 IST
పొగాకు ఉత్పత్తుల వాడకంలో చివరి స్థానంలో ఏపీ!
అమరావతి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): పొగాకు ఉత్పత్తుల వాడకంలో ఆంధ్రప్రదేశ్‌లోని చిన్నారులు చివరి స్థానంలో ఉండడం మంచి పరిణామమని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ అన్నారు. ‘గ్లోబల్ యూత్ టుబాకో సర్వే.. ఏపీ ఫ్యాక్ట్ షీట్’ను మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాఠశాల స్థాయి పిల్లలపై కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపీఎస్) 2019లో సర్వే చేసిందని చెప్పారు. దేశవ్యాప్తంగా పొగాకు ఉత్పత్తులు ఎక్కువగా వాడుతున్న చిన్నారుల జాబితాలో ఏపీ చివరి స్థానంలో నిలిచిందని వెల్లడించారు.