నేనూ ప్రతిపక్షంలో ఉన్నా..ఇలాంటి బూతులు ఎవరూ మాట్లాడలేదు

ABN , First Publish Date - 2021-10-21T08:26:52+05:30 IST

‘‘నన్ను తిట్టే బూతులు వినలేక, తట్టుకోలేక, బీపీ పెరిగిన అభిమానస్థులు రాష్ట్రమంతా తెలుగుదేశంపై రియాక్షన్‌ చూపించారు’’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

నేనూ ప్రతిపక్షంలో ఉన్నా..ఇలాంటి బూతులు ఎవరూ మాట్లాడలేదు

అభిమానస్థులు రియాక్షన్‌ చూపారు: సీఎం

అమరావతి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ‘‘నన్ను తిట్టే బూతులు వినలేక, తట్టుకోలేక, బీపీ పెరిగిన అభిమానస్థులు రాష్ట్రమంతా తెలుగుదేశంపై రియాక్షన్‌ చూపించారు’’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, విజయవాడలోని ఆయన ఇల్లు సహా తెలుగుదేశం కేంద్ర కార్యాలయం, పలు జిల్లాల్లోని ఆ పార్టీ ఆఫీసులపై వైసీపీ శ్రేణులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడులపై సీఎం జగన్‌ స్పందించారు. అయితే, దాడులను ఎక్కడా ముఖ్యమంత్రి ఖండించకపోవడం గమనార్హం. పైగా వాటిని సమర్థించేలా జగన్‌ ప్రతిస్పందించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ బుధవారం ‘జగనన్న తోడు’ పథకం కింద వడ్డీ మొత్తం విడుదల చేశారు. ఈ సందర్భంగా దాడుల అంశం ప్రస్తావించారు. ‘‘నా పట్ల మీ ఆప్యాయత చూసి, జీర్ణించుకోలేనివిధంగా ప్రతిపక్షం తయారైంది. బూతులు తిడతారు. ఎవరూ మాట్లాడలేని అన్యాయమైన బూతులవి. నేనూ ప్రతిపక్షంలో ఉన్నాను. కానీ ఏరోజూ ఇటువంటి మాటలు ఎవరూ మాట్లాడలేదు. అంతటి దారుణమైన బూతులవి.  ఆ బూతులు తిట్టినవారిపై మనల్ని అభిమానించేవాళ్లూ, బీపీ పెరిగినవారూ రియాక్షన్‌ చూపించడం రాష్ట్రమంతటా కనిపించింది. వైషమ్యాలను సృష్టించి, కావాలని తిట్టించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆరాటం... ఖర్మ కొద్దీ ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తోంది.’’ అని సీఎం అన్నారు. 


వినుడు.. వినుడు... వైసీపీ బూతు పురాణం


‘ఈ వ్యక్తిని నడిరోడ్డుమీద పెట్టి కాల్చినా తప్పులేదు’ 

‘ఈ ఫోర్‌ ట్వంటీ పాలనలో..’

‘అన్నా అనాలా లేక దున్న అనాలా’

‘ముఖ్యమంత్రి అంటామా.. ఇలాంటి వ్యక్తిని ముఖ్య కంత్రీ అంటామా..’

నిన్ను బంగాళాఖాతంలో కలిపే గొంతు కూడా అదే అవుతుంది’

‘ఉరిశిక్ష వేసినా కూడా తప్పులేదు’

- నాటి సీఎం చంద్రబాబును ఉద్దేశించి విపక్ష నేత జగన్‌ 


‘నిన్ను ఈ సమావేశ వేదిక నుంచి ఒరేయ్‌ లం.....కొడకా అని తిట్టాలనిపిస్తోంది’ 

- చంద్రబాబును ఉద్దేశించి 

కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి  

‘సోనియా గాంధీతో చేతులు కలిపి రాజకీయ లంజత్వానికి పాల్పడలేదా?’ 

- చంద్రబాబును ఉద్దేశించి 

అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం


‘తిరుపతి గుడి నీయమ్మ మొగుడు కట్టించాడా..’ 

- చంద్రబాబును ఉద్దేశించి మంత్రి కొడాలి నాని


‘ఆడదానివని కూడా చూడను..నాలుక కట్‌ అవుతుంది జాగ్రత్త..’ 

- టీడీపీ మహిళా నేతపై 


వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం

‘లక్షలు దెం... లం.. కొడుకు వాడు సీఐ’ 

- వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

Updated Date - 2021-10-21T08:26:52+05:30 IST