జీవో 100పై కౌంటర్‌ వేయండి

ABN , First Publish Date - 2021-10-07T08:30:13+05:30 IST

ప్రభుత్వ జీవోలను ఏపీఈ-గెజిట్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు వీలుకల్పిస్తూ జారీచేసిన జీవో 100కు సంబంధించి రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది.

జీవో 100పై కౌంటర్‌ వేయండి

ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

అమరావతి, అక్టోబరు6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జీవోలను ఏపీఈ-గెజిట్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు వీలుకల్పిస్తూ జారీచేసిన జీవో 100కు సంబంధించి రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. సెప్టెంబరు 7న జారీ చేసిన ఈ జీవోను సవాల్‌ చేస్తూ తెలుగువన్‌.కామ్‌ డిజిటల్‌ మీడియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ కంఠంనేని రవిశంకర్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం దీనిపై విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. పిటిషనర్‌ తరఫున పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపించారు.

Updated Date - 2021-10-07T08:30:13+05:30 IST