నేడు శ్రీశైలానికి అమిత్‌షా

ABN , First Publish Date - 2021-08-12T08:05:02+05:30 IST

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కుటుంబసమేతంగా గురువారం

నేడు శ్రీశైలానికి అమిత్‌షా

  • తొలిసారిగా మల్లన్న దర్శనానికి రాక
  • కుటుంబ సమేతంగా వస్తున్న హోం మంత్రి

 

కర్నూలు, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కుటుంబసమేతంగా గురువారం శ్రీశైలానికి రానున్నారు. ఉదయం 9 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీలో బయలుదేరి 11.15 గంటలకు హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 12.25 గంటలకు సున్నిపెంటకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం చేరుకుంటారు. మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 గంటల మధ్య మల్లన్నను దర్శించుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు భ్రమరాంబ అతిథి గృహంలో భోజనం చేస్తారు.


మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి హెలికాప్టర్‌లో హైదరాబాదుకు బయలుదేరుతారు. అక్కడి నుంచి 3.50 గంటలకు ఢిల్లీకి బయలుదేరతారు. తొలిసారిగా మల్లన్న దర్శనానికి శ్రీశైలం వస్తున్న అమిత్‌ షాకు స్వాగతం పలకడానికి దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఏపీ దేవదాయ శాఖ కమిషనర్‌ వాణీ మోహన్‌ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా,తెలంగాణ బీజేపీనేత ఈటె ల రాజేందర్‌కూడా శ్రీశైలం వస్తున్నట్లు సమాచారం.


Updated Date - 2021-08-12T08:05:02+05:30 IST