ప్రభుత్వ ఉద్యోగుల కష్టం పగవాడికి కూడా రాకూడదు: లోకేశ్

ABN , First Publish Date - 2021-11-29T03:51:06+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఓ ప్రకటనలో అన్నారు. కనీసం వారిని..

ప్రభుత్వ ఉద్యోగుల కష్టం పగవాడికి కూడా రాకూడదు: లోకేశ్

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఓ ప్రకటనలో అన్నారు. కనీసం వారిని మనుషుల్లా కూడా చూడకుండా ప్రభుత్వ పెద్దలు అవమానిస్తున్న తీరు బాధాకరమన్నారు. ఆఖరికి ఉద్యోగులు దాచుకున్న రూ.1600 కోట్లను ప్రభుత్వం ఇవ్వక పోవటం దారుణమని మండిపడ్డారు. పీఆర్సీ నివేదిక బహిర్గతం చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం తాత్సారం చేయకుండా సీపీఎస్ రద్దు చేయలన్నారు. రూ.1600 కోట్లు వెంటనే విడుదల చేయాలని సూచించారు. పెండింగ్‌లో పెట్టిన 7 డీఏలు వెంటనే ఇవ్వాలని,  కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-11-29T03:51:06+05:30 IST