బహిరంగ సభకు అనుమతివ్వండి

ABN , First Publish Date - 2021-12-15T08:16:03+05:30 IST

బహిరంగ సభకు అనుమతివ్వండి

బహిరంగ సభకు అనుమతివ్వండి

‘మూడు’కు మద్దతుగా 17న తిరుపతిలో సభ 

హైకోర్టులో రాయలసీమ మేధావుల ఫోరం వ్యాజ్యం


అమరావతి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు అనుమతివ్వాలని రాయలసీమ మేధావుల ఫోరం హైకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 17న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహణకు అనుమతిచ్చేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఫోరం ప్రతినిధులు పురుషోత్తం రెడ్డి, డాక్టర్‌ ఎం.మస్తానమ్మ, జి.జయచంద్రారెడ్డి ఈ వ్యాజ్యం వేశారు. సభకు అనుమతివ్వాలని కోరుతూ ఇచ్చిన వినతిని పోలీసులు తిరస్కరించారని తెలిపారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఫోరం స్వాగతిస్తోందన్నారు. వివిధ అంశాలపై చర్చించేందుకు తిరుపతిలో సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ పిటిషన్‌తో పాటు అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం హైకోర్టు విచారించనుంది. బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని వారు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2021-12-15T08:16:03+05:30 IST